శత్రువులను చీల్చి చెండాడేందుకు సరిపడా ఆయుధాలున్నాయి.. అపోహలొద్దు: భారత ఆర్మీ చీఫ్
- పది రోజులకు సరిపడా ఆయుధాలే ఉన్నాయన్న ఆరోపణల్లో నిజం లేదు
- ఆయుధాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నాం
- అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధాలున్నాయి
ఈ ఏడాది జూలైలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఓ నివేదిక విడుదల చేస్తూ ఆర్మీ వద్ద కేవలం పది రోజులకే సరిపడ ఆయుధాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నివేదికపై స్పందించిన రావత్ అటువంటిదేమీ లేదని తాజాగా తేల్చిచెప్పారు. శత్రువులను మట్టికరిపించేందుకు అవసరమైన ఆయుధ సంపత్తి తమ వద్ద ఉందని తేల్చి చెప్పారు. జమ్ముకశ్మీర్లో ‘స్టోన్ పెల్టింగ్’ బాగా తగ్గిందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్లు నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు. సమస్య రాత్రికి రాత్రి పరిష్కారం కాదని రావత్ పేర్కొన్నారు.