రానున్న సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌ల కానున్న రాజుత‌రుణ్ 'రాజుగాడు' సినిమా షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ తో తాము చేసిన సంద‌డిని న‌టుడు రాజ్‌త‌రుణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు.

 రాజేంద్ర ప్ర‌సాద్ వంట వండార‌ని తెలుపుతూ ఆయ‌న ఓ ఫొటో పోస్ట్ చేశాడు. అందులో లుంగీ క‌ట్టుకుని వంట వండుతోన్న రాజేంద్ర ప్ర‌సాద్ క‌న‌ప‌డుతున్నారు. రాజేంద్ర ప్ర‌సాద్‌తో ప‌ని చేయ‌డం ఎంతో ఆనందాన్నిస్తుంద‌ని రాజ్ త‌రుణ్ తెలిపాడు. తాను మెల్లిగా ఫుడ్‌ను చోరీ చేయాల‌ని చూశానని, అయితే, ఈ లోపే భోజ‌నం వడ్డించేశారని, చాలా రుచికరంగా వుందని పేర్కొన్నాడు.