పద్ధతి మార్చుకోండి.. లేకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: చైనాకు భారత్ వార్నింగ్

  • అరుణాచల్ ప్రదేశ్ మాదే
  • అక్కడ పర్యటించే అధికారం మాకు ఉంటుంది
  • వన్ బెల్ట్ వన్ రోడ్ విషయంలో కూడా మాకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి
భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ చైనా వాదిస్తున్న సంగతి తెలిసిదే. అంతేకాదు, ఇటీవల భారత్ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడాన్ని కూడా తప్పుబట్టింది. అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, చైనాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది భారత్. భారత్ లో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని... భారతదేశ నేతలు, ప్రజలు, అధికారులు ఎవరికైనా, ఎప్పుడైనా సరే అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించే అధికారం ఉంటుందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

తమ దేశంలో ఒక రాష్ట్రమైన అరుణాచల్ లో పర్యటించే స్వేచ్ఛ, హక్కు తమ ప్రజలకు ఉంటుందని చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన వ్యవహారాల్లో చైనా ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తినా... పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దక్షిణ టిబెట్ లో అరుణాచల్ ప్రదేశ్ భాగమన్న చైనా వ్యాఖ్యలు హాస్యాస్పదమని తెలిపింది. అలాగే చైనా నిర్మిస్తున్న 'వన్ బెల్ట్ వన్ రోడ్' విషయంలో కూడా భారత్ కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పింది.
Go Back to Shorts
India
China
arunachal pradesh
on belt one road

More Telugu News