జగిత్యాలలో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న తోడ‌బుట్టిన‌ సోద‌రిని కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన ఓ యువ‌కుడు ఆమెను గొలుసుల‌తో బంధించి ఇంట్లోని ఓ గ‌దిలో ఉంచాడు. చివ‌ర‌కు ఆమె ఇంట్లోంచి ఎలాగోలా త‌ప్పించుకుని బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆ యువ‌తి ప‌రిస్థితి చూసి చ‌లించిపోయిన స్థానికులు ఆ క‌సాయి అన్న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి పేరు గీత (25) అని చెప్పారు. గీత అన్న త‌న భార్య‌తో క‌లిసి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడ‌ని తెలిపారు. గీత‌కు మ‌తిస్థిమితం స‌రిగా లేని కార‌ణంగానే తాము ఆమెను కట్టి ఉంచామని కుటుంబ స‌భ్యులు పోలీసుల‌తో చెప్పారు.