ఏనుగుల దుస్థితికి ద‌ర్ప‌ణం ప‌డుతున్న ఫొటో.... ఉత్త‌మ వైల్డ్‌లైఫ్ ఫొటోగా ఎంపిక‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏనుగుల దుస్థితికి ద‌ర్ప‌ణం ప‌డుతున్న ఫొటో.... ఉత్త‌మ వైల్డ్‌లైఫ్ ఫొటోగా ఎంపిక‌

  • శాంక్చుయ‌రీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్ర‌ఫీ అవార్డ్స్ 2017
  • 'హెల్ ఈజ్ హియ‌ర్‌' క్యాప్ష‌న్‌తో ఫొటో తీసిన బిప్లాబ్ హ‌జ్రా
  • ప‌శ్చిమ బెంగాల్‌లో తీసిన ఫొటో
భ‌యంతో ప‌రిగెడుతున్న ఏనుగు, ప‌క్క‌నే దాని పిల్ల‌, వాటి కాళ్ల ద‌గ్గ‌ర మంట‌లు... ఆ వెన‌కాలే మ‌నుషులు.. ప‌శ్చిమ బెంగాల్‌లోని బంకుర జిల్లాలో ప్ర‌తిరోజూ క‌నిపించే దృశ్యానికి అద్దం ప‌ట్టే ఈ ఫొటో శాంక్చుయ‌రీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్ర‌ఫీ అవార్డ్స్ 2017లో ఉత్తమ వైల్డ్‌లైఫ్ ఫొటోగా ఎంపికైంది. ఏనుగుల దుస్థితికి ద‌ర్ప‌ణం ప‌డుతున్న ఈ ఫొటోను చూస్తే మ‌నుషుల వ‌ల్ల మూగ‌జంతువులు ఎంతె‌లా ఇబ్బంది ప‌డుతున్నాయో అర్థ‌మవుతోంది.

'హెల్ ఈజ్ హియ‌ర్‌' క్యాప్ష‌న్‌తో ఈ ఫొటోను బిప్లాజ్ హ‌జ్రా అనే ఫొటోగ్రాఫ‌ర్ తీశాడు. ముంబైకి చెందిన శాంక్చుయ‌రీ నేచ‌ర్ ఫౌండేష‌న్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ అవార్డుల‌ను అంద‌జేసింది. ఏనుగులు నివ‌సించ‌డానికి చాలా పెద్ద వైశాల్యం కావాల్సి వ‌స్తుంది. కానీ మ‌నుషుల ఆక్ర‌మ‌ణ వ‌ల్ల అడ‌వుల వైశాల్యం త‌గ్గిపోయి, వాటి జీవ‌నం ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. అంతేకాకుండా ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం మ‌నుషులు చేసే ప్ర‌య‌త్నాలు కూడా ఏనుగుల‌కు ప్రాణ‌హాని క‌లిగిస్తున్నాయి.
elephants
india
west bengal
wild life
endanger
best photo

More Telugu News