భారత మార్కెట్లోకి 'నోకియా 5.. 3జీబీ ర్యామ్' ఫోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత మార్కెట్లోకి 'నోకియా 5.. 3జీబీ ర్యామ్' ఫోన్

  • ధర రూ. 13,499
  • మొదట ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు
  • ర్యామ్ మిన‌హా మిగ‌తా ఫీచ‌ర్ల‌న్నీ నోకియా 5, 2 జీబీ మోడ‌ల్‌వే
నోకియా 5 మోడ‌ల్‌కి వ‌స్తున్న ఆద‌ర‌ణను చూసి మ‌రో మోడ‌ల్‌ను భార‌త మార్కెట్లోకి నోకియా సంస్థ తీసుకువ‌చ్చింది. మొద‌ట విడుద‌ల చేసిన నోకియా 5 మోడ‌ల్‌తో పోల్చితే ఈ కొత్త మోడ‌ల్‌లో ఒక్క ర్యామ్‌లో మాత్ర‌మే తేడా క‌నిపిస్తోంది. అందుకే దీనిని నోకియా 5, 3జీబీ ర్యామ్ వేరియంట్ పేరుతో మార్కెట్లోకి విడుద‌ల చేసింది.

దీని ధ‌ర‌ను రూ. 13,499గా కంపెనీ నిర్ణ‌యించింది. ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్ వాణిజ్య వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మ‌కాలు ప్రారంభమ‌య్యాయి. వారం రోజుల పాటు ఈ అమ్మ‌కాలు ఫ్లిప్‌కార్ట్‌లో మాత్ర‌మే కొన‌సాగ‌నున్నాయి. నోకియా - జియో ఆఫ‌ర్ కింద ఈ ఫోన్ కొన్న‌వారికి కొన్ని రీఛార్జీ స‌దుపాయాల‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందుబాటులో ఉంచింది. వారం రోజుల ఆన్‌లైన్ అమ్మ‌కాల త‌ర్వాత కొన్ని ప్ర‌త్యేక రిటైల్ స్టోర్ల‌లో ఈ ఫోన్ అమ్మ‌కాలు జ‌ర‌గ‌నున్నాయి.
flipkart
indian market
nokia
nokia 5
3gb
variant
ram

More Telugu News