కి‘లేడీ’ ఉచ్చులో చిక్కి విలవిల్లాడుతున్న రాజకీయ నాయకులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కి‘లేడీ’ ఉచ్చులో చిక్కి విలవిల్లాడుతున్న రాజకీయ నాయకులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు!

  • టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకు హీరోయిన్లు పరిచయమంటూ మెసేజ్
  • కొత్త హీరోయిన్‌కు రూ.3 లక్షలు, పాత హీరోయిన్‌కు రూ.2 లక్షలు అంటూ బేరం
  • ఆకర్షితులపై మోసపోతున్న యువత
సామాజిక బంధాలను మరింత పటిష్టం చేయాల్సిన సామాజిక మాధ్యమాలు కొందరికి అక్రమంగా సొమ్ములు సంపాదించి పెట్టే బంగారు బాతుగుడ్లుగా మారుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వీటిని ఉపయోగించుకుని ‘దందా’లు నిర్వహిస్తున్నారు. చిన్న వాట్సాప్ మెసేజ్‌తో యువకుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ బురిడీ కొట్టిస్తూ లక్షలు దండుకుంటున్న మాయ‘లేడీ’ కథ ఇది.

మగాళ్ల బలహీనతను సొమ్ముగా మార్చుకుంటున్న ఆ మోసగత్తె పేరు సల్మాలక్ష్మి. ‘మీకు సినీ, టీవీ ఆర్టిస్టులతో గడపాలని ఉందా? నాకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు తెలుసు. అడ్వాన్స్ చెల్లిస్తే వారి నంబరు ఇస్తా. తర్వాత మీ ఇష్టం. కొత్త  హీరోయిన్లు అయితే రూ. 3 లక్షలు, పాత హీరోయిన్లు అయితే రూ.2 లక్షలు’’ అంటూ వాట్సాప్ మెసేజ్ పెడుతుంది. అది చూసి ఉత్సుకతతో ముందుకొచ్చిన వారు నిండా మునిగినట్టే.

ఇప్పటి వరకు ఆమె వలలో పలువురు చిక్కుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ప్రశాంత్ (23) రూ.25 వేలు మోసపోయాడు. ఓ మాజీ మంత్రి కుమారుడు, కాంగ్రెస్ యువనేత కూడా ఆమె బారినపడి మోసపోయారు. సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్ అయిన సందీప్ (24) ఏకంగా రెండు నెలల జీతాన్ని ఆమె చేతిలో పోసి కక్కలేని, మింగలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువనేత ఏకంగా లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు.

మాయలేడీ వలలో చిక్కుకున్న వారు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎవరికైనా చెబితే పరువుపోతుందని భావించి తమలో తామే కుమిలిపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. పరువు, ప్రతిష్ఠలను దృష్టిలో పెట్టుకుని పోలీసు గుమ్మం ఎక్కేందుకు భయపడుతున్నారు. దీనిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్న సల్మా మరింత రెచ్చిపోతోంది. ఏజెంట్లను నియమించుకుని మరీ దందాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమెకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఆమె ఆట కట్టిస్తామని  పేర్కొన్నారు.
Woman
Tollywood
Actress
Hyderabad

More Telugu News