తెలుగు రాష్ట్రాల్లో 'రాజా ది గ్రేట్' వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు రాష్ట్రాల్లో 'రాజా ది గ్రేట్' వసూళ్లు

  • పోటీని తట్టుకుని నిలబడిన 'రాజా ది గ్రేట్' 
  • కొనసాగుతోన్న వసూళ్ల జోరు 
  • ఒక్క నైజామ్ లోనే 10.76 కోట్లు
రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'రాజా ది గ్రేట్' క్రితం నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలై 20 రోజులవుతున్నా, వసూళ్ల జోరు కొనసాగుతూనే వుంది. ఈ సినిమా తరువాత కొన్ని కొత్త సినిమాలు థియేటర్లకు వచ్చాయి. వాటి పోటీని తట్టుకుని నిలబడిన 'రాజా ది గ్రేట్' వసూళ్లను పెంచుకుంటూ వెళుతుండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంతవరకూ 26.66 కోట్ల రూపాయలను రాబట్టింది.

 నైజామ్ లో 10.76 కోట్లు .. సీడెడ్ లో 4.20 కోట్లు .. గుంటూరులో 1.65 కోట్లు .. కృష్ణాలో 1.73 కోట్లు .. తూర్పు గోదావరిలో 1.97 కోట్లు .. పశ్చిమ గోదావరిలో 1.60 కోట్లు .. వైజాగ్ లో 3.70 కోట్లు .. నెల్లూరులో 1.05 కోట్లు వసూలయ్యాయి. కథ .. కథనాలు .. అనిల్ రావిపూడి టేకింగ్ .. రవితేజ నటన .. మెహ్రీన్ గ్లామర్ ఈ సినిమా విజయాన్ని అందుకుని ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     
raviteja
mehreen

More Telugu News