Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయేషా సైగల్ కి కోలీవుడ్ కలిసొచ్చేలానే వుంది!

  • తమిళంలో సాయేషాకి పెరుగుతోన్న క్రేజ్ 
  • 'వనమగన్'లో ఆమె గ్లామర్ కి ఎక్కువ మార్కులు
  • వరుసగా వస్తోన్న అవకాశాలు 
  • కార్తీ జోడీగా మరోసారి ఛాన్స్  
తెలుగు తెరకు 'అఖిల్' సినిమాతోను .. హిందీ తెరకు 'శివాయ్' సినిమాతోను సాయేషా సైగల్ పరిచయమైంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆమె కెరియర్ కి హెల్ప్ కాలేదు. దాంతో ఈ సుందరి తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. జయం రవి జోడీగా 'వనమగన్' సినిమా చేసిన ఆమె, కార్తీతో ఓ సినిమా .. విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పై వున్నాయి.

 ఈ నేపథ్యంలోనే సాయేషా మరోసారి కార్తీ సరసన చేసే ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో కార్తీ సరసన ముగ్గురు కథానాయికలు కనిపిస్తారట. ఒక కథానాయికగా సాయేషా సైగల్ ను తీసుకున్నారని అంటున్నారు. 'వన మగన్' సినిమా ఫలితం ఎలా వున్నా, అమ్మడి గ్లామర్ కి అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారట. ఆమెకి గల క్రేజ్ కారణంగానే వరుస  అవకాశాలు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.               
saiyesha saigal

More Telugu News