సౌదీ అరేబియాపై క్షిపణి దాడి
- యెమన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణి
- భారీ ప్రాణనష్టమే లక్ష్యంగా క్షిపణి దాడి
- కూల్చివేసిన సౌదీ అరేబియా
తమపైకి దూసుకొస్తున్న క్షిపణిని కూల్చేసిన సమయంలో కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. భారీగా ప్రాణనష్టం కలిగించే లక్ష్యంతో, జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 1200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారని వెల్లడించారు.