జోరు పెంచేస్తోన్న శ్రీముఖి .. నందూ జోడీగా సినిమా!
Add ap7am to your home Screen

జోరు పెంచేస్తోన్న శ్రీముఖి .. నందూ జోడీగా సినిమా!

  • 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో శ్రీముఖి 
  • తరువాత సినిమాగా 'కుటుంబ కథా చిత్రం'
  • ఈ సినిమాలో నందూ జోడీగా
యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రల్లో రాణిస్తూ ఉంటే, కథానాయిక పాత్రలతో రష్మీ .. శ్రీముఖి పోటీలు పడుతున్నారు. ఇప్పటికే రష్మీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. ఇక శ్రీముఖి కూడా తన క్రేజ్ ను మరింత పెంచుకునే పనిలో వుంది. నిన్నమొన్నటి వరకూ చిన్నచిన్న పాత్రలనే చేస్తూ వచ్చిన శ్రీముఖి, హర్షవర్ధన్ దర్శకత్వంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో లీడ్ రోల్ చేస్తోంది.

ఆ తరువాత సినిమాను ఆమె వి.ఎస్.వాసు దర్శకత్వంలో చేస్తోంది. 'కుటుంబ కథా చిత్రం' అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నందూ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీముఖి ఐటీ ఉద్యోగిగా కనిపించనుంది. కొత్తగా పెళ్లైన ఒక జంట మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్ కావడం వలన ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఈ సినిమా కథాంశమని దర్శకుడు చెప్పాడు. ఈ సినిమాతో శ్రీముఖి మరింత బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.       
srimukhi
nandu

More Telugu News