చక్రి ఆస్తులను ఆయన భార్య నుంచి లాక్కోలేదు .. అద్దె ఇంట్లో ఉంటున్నాం : మహిత్ నారాయణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చక్రి ఆస్తులను ఆయన భార్య నుంచి లాక్కోలేదు .. అద్దె ఇంట్లో ఉంటున్నాం : మహిత్ నారాయణ్

  • చక్రి నాకు స్టూడియో ఇవ్వలేదు 
  • అది నా పేరున ఉందనేది అబద్ధం 
  • ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నాను 
  • అన్నయ్య పోయాడనే దానికన్నా ఏదీ ఎక్కువ బాధను కలిగించలేదు   
చక్రి చనిపోయిన తరువాత ఆయన ఆస్తులను అనుభవిస్తూ .. ఆయన భార్యను రోడ్డున పడేశారంటూ కుటుంబ సభ్యులపై అప్పట్లో వార్తలు షికారు చేశాయి. ఆ విషయాన్ని గురించి మహిత్ నారాయణ్ దగ్గర ఐ డ్రీమ్స్ ప్రస్తావించడంతో ఆయన స్పందించారు. "నిజంగా అన్నయ్య ఆస్తులను నేను లాగేసుకుంటే అద్దింట్లో ఉండాల్సిన అవసరం ఏవుంది? క్యాబుల్లో తిరగాల్సిన అవసరం ఏవుంది? అవన్నీ నిజంగా తీసుకుని ఉంటే .. ఈ రోజున మేం ఇంతగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా" అన్నారు.

 "ఇదంతా కొంతమంది చేస్తోన్న ప్రచారం. ఈ రోజున స్టూడియో కూడా లేకుండా చిన్న ఎక్విప్ మెంట్ ఇంట్లో పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నాను. స్టూడియో నా పేరున వుందనేది కూడా అబద్ధమే. దాని విషయంలోను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. ఈ విషయంలో ఫైట్ చేసి అలసిపోవాలనుకోవడం లేదు. వచ్చేవి వస్తాయి .. పోయేవి పోతాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా .. అవి అన్నయ్యను పోగొట్టుకున్నంత పెద్దవైతే కాదు .. అవి అంతకన్నా ఎక్కువ బాధను కలిగించలేవు"అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.    
mahith narayan

More Telugu News