టీచర్ సరితతో మాట్లాడి, ఆ టేపులు లీక్ చేసి, నారాయణ కాలేజీ పరువు తీసిన నవీన్ అరెస్ట్!
- సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న ఉప్పల్ పోలీసులు
- విచారిస్తున్న ఉన్నతాధికారులు
- నోరు విప్పితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయనంటున్న పోలీసు వర్గాలు
నవీన్ ను విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ కు తరలించారు. అతను నోరువిప్పితే నారాయణ సంస్థల లోగుట్టు బయటపడే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఆరోపణలు ఎదుర్కొంటున్న జయసింహారెడ్డి, వెంకటరెడ్డి, , రమేష్, సతీశ్ పాత్రలపై ఇప్పటికే నారాయణ యాజమాన్యం అంతర్గత విచారణ చేపడుతుండగా, పోలీసులు సైతం నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.