అదంతా పూరీ జగన్నాథ్ చలవ - చక్రి సోదరుడు మహిత్ నారాయణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదంతా పూరీ జగన్నాథ్ చలవ - చక్రి సోదరుడు మహిత్ నారాయణ్

  • చక్రికి పూరీగారు 'బాచి' సినిమాతో ఛాన్స్ ఇచ్చారు 
  • అది అన్నయ్యకి మంచి పేరు తెచ్చింది 
  • ఆ దిశగా నన్ను అన్నయ్య ప్రోత్సహించాడు
  • అదే బాటలో కొనసాగుతున్నాను    
తెలుగు సంగీత దర్శకులలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని .. తెలుగు పాటపై చక్రి తనదైన ముద్ర వేశారు. తెలుగు పాటకు కొత్త పరిమళాన్ని అద్దిన ఆయన ఆ తరువాత హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన కెరియర్ గురించి .. ఆయనతో తనకి గల అనుబంధాన్ని గురించి చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ తాజాగా ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు. "ఇద్దరం ఒకే ఫీల్డ్ లో ఉండటం ఇష్టం లేక నేను చిన్న చిన్న బిజినెస్ లు చేసుకుంటూ ఉండేవాడిని. మ్యూజిక్ వైపు వచ్చేయమని అన్నయ్య ప్రోత్సహించడంతో అటువైపు వచ్చాను" అని అన్నారు.

"అన్నయ్యకి 'బాచి' సినిమాతో మంచి పేరు వచ్చింది .. ఆయన కెరియర్ ఒక ట్రాక్ ఎక్కేసింది. అన్నయ్యకి ఆ ఛాన్స్ ఇచ్చిన పూరీ గారు మా అందరికీ గాడ్. ఇండస్ట్రీకి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయడానికి చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటిది అన్నయ్య చేసిన ఒకేఒక్క సాంగ్ విని పూరీ గారు ఛాన్స్ ఇచ్చారు. పూరీగారు అన్నయ్యకి ఛాన్స్ ఇవ్వడం అన్నది.. నేను కూడా ఈ రోజు అదే రూట్లో ఉండటానికి కారణమైంది. అందువలన ఆయనని గాడ్ గా భావిస్తూ వుంటాను" అంటూ చెప్పుకొచ్చారు.   
mahith narayan

More Telugu News