పాకిస్థాన్ జాతిపిత మ‌హ్మ‌ద్ అలీ జిన్నా ఏకైక కుమార్తె దినా మ‌ర‌ణం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్ జాతిపిత మ‌హ్మ‌ద్ అలీ జిన్నా ఏకైక కుమార్తె దినా మ‌ర‌ణం!

  • న్యూయార్క్‌లోని త‌న ఇంట్లో మ‌ర‌ణించిన దినా వాడియా
  • 98 ఏళ్లు జీవించిన దినా
  • ఆమెకు కుమారుడు నస్లీ వాడియా, కూతురు డ‌యానా వాడియా ఉన్నారు
పాకిస్థాన్ జాతిపిత మ‌హ్మ‌ద్ అలీ జిన్నా ఏకైక కుమార్తె దినా వాడియా గురువారం న్యూయార్క్‌లోని త‌న ఇంట్లో త‌నువు చాలించారు. 98 ఏళ్ల వ‌య‌సున్న ఆమె గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆమె మ‌ర‌ణ‌వార్త‌ను వాడియా గ్రూప్ ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించారు. ఆమెకు కుమారుడు నస్లీ ఎన్ వాడియా (వాడియా గ్రూప్ చైర్మ‌న్), కూతురు డ‌యానా ఎన్ వాడియా ఉన్నారు. ఆమె అంత్య‌క్రియ‌లు న్యూయార్క్‌లో జ‌రుగుతాయ‌ని ప్ర‌తినిధి పేర్కొన్నాడు. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా దినా వాడియా కుటుంబం న్యూయార్క్‌లోనే నివాసం ఉంటోంది. వ్యాపార అవ‌స‌రాల నిమిత్తం నస్లీ వాడియా ముంబైకి వ‌స్తుంటారు.

1919 ఆగ‌స్టు 15న జ‌న్మించిన దినా వాడియా, పార్శీ కుటుంబానికి చెందిన నెవెల్లీ వాడియాను 1938లో పెళ్లి చేసుకుంది. దేశంలో ఎంతో మంది ముస్లిం అబ్బాయిలు ఉండ‌గా పార్శీ వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం ఎందుక‌ని తండ్రి ఆమెను ప్ర‌శ్నించ‌గా... 'మ‌రి నువ్వెందుకు పార్శీ అమ్మాయిని చేసుకున్నావ్?' అని దినా తిరిగి ప్ర‌శ్నించింద‌ట‌. మ‌హ్మ‌ద్ అలీ జిన్నా కూడా పార్శీ కుటుంబానికి చెందిన ర‌త్త‌న్ బాయిని పెళ్లిచేసుకున్నాడు.
pakistan
founder
mohammed ali jinna
dina wadia
raymond

More Telugu News