ఈ ఒక్క పని చేస్తే నా ప్రతీకారం పూర్తవుతుంది: రామ్ గోపాల్ వర్మ
- నేను ఎందుకూ పనికిరానని అమ్మ భావించేది
- నాగ్ సినిమాకు ఆమెతో క్లాప్ కొట్టిస్తా
- ఫేస్ బుక్ లో వర్మ కామెంట్

ఈ నెల 20వ తేదీన నాగ్ తో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వర్మ తెలిపారు. అయితే ఈ సినిమా 'శివ'కు సీక్వెల్ గా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన నాగార్జున... ఈ ప్రచారం అసత్యమని చెప్పారు. ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి పోలిక ఉండదని తెలిపారు.