బ్రేకింగ్... కొలరాడోలోని వాల్ మార్ట్ స్టోర్ పై ఉగ్రదాడి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రేకింగ్... కొలరాడోలోని వాల్ మార్ట్ స్టోర్ పై ఉగ్రదాడి!

  • ఇద్దరు మృతి, ఓ మహిళకు గాయాలు
  • ఎందుకు కాల్చాడో తెలియరాలేదు
  • ట్విట్టర్ లో పోలీసు అధికారులు
న్యూయార్క్ లోని సైకిల్ ట్రాక్ పై ట్రక్కుతో దూసుకొచ్చి జనాలను నిర్దాక్షిణ్యంగా తొక్కించిన ఘటనను మరువక ముందే కొలరాడోలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఓ వ్యక్తి తుపాకితో విరుచుకుపడ్డాడు. ప్రాథమిక సమాచారం మేరకు దుండగుడి కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ఓ మహిళకు గాయాలు అయ్యాయి. డెన్వర్ శివార్లలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఈ ఘటన జరుగగా, విషయం తెలుసుకున్న పోలీసులు గన్ ఫైర్ కు దిగాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించిన థ్రాంటన్ పోలీస్ విభాగం మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించినట్టు అధికారి ఒకరు తెలిపారు. కాల్పులకు కారణం ఎవరు? ఎందుకు కాల్పులు జరిపాడు? అన్న విషయాలు తెలియరాలేదు. అతను యాక్టివ్ షూటర్ కాదని, సాధ్యమైనంత త్వరలోనే పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపింది ఉగ్రవాదా? అన్న కోణంలోనూ విచారిస్తామని వెల్లడించారు.
colarado
walmart
firign

More Telugu News