అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో హాలోవీన్ పండగ!
- విచిత్ర వేషధారణల్లో వ్యోమగాములు
- ఇన్స్టాగ్రాంలో ఫొటో పోస్ట్ చేసిన ఐఎస్ఎస్
- శుభాకాంక్షలు తెలియజేసిన వ్యోమగాములు
ఈ ఫొటోలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములు, ఇద్దరు రష్యన్ వ్యోమగాములు, ఒక ఇటాలియన్ వ్యోమగామి ఉన్నారు. వొల్వరిన్ వేషధారణలో ఉన్నది నాసా వ్యోమగామి మార్క్ టి వాందే హై, జాక్ ఓ లాంటర్న్ టీ షర్ట్ వేసుకున్నది నాసా వ్యోమగామి జోసెఫ్ ఎం. అకాబా, మినియన్ టీ షర్ట్ వేసుకున్నది నాసా వ్యోమగామి రాండీ బ్రెస్నిక్గా తెలుస్తోంది. అలాగే కోతి వేషంలో రష్యన్ వ్యోమగామి సెర్జీ రజిన్స్కి, స్పైడర్ మ్యాన్ లాగ ఇటాలియన్ వ్యోమగామి పావులో ఉన్నారు.