వెరైటీ! స్పిన్ బౌలింగ్ వేసి మూడు వికెట్లు పడగొట్టిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగ.. మీరూ చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెరైటీ! స్పిన్ బౌలింగ్ వేసి మూడు వికెట్లు పడగొట్టిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగ.. మీరూ చూడండి!

  • మైదానంలో వెలుతురు సరిగా లేకపోవడంతో స్పిన్నర్‌గా మారిన మలింగ
  • మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించిన వైనం
  • వైరల్ అవుతున్న వీడియో
తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించే శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. అంతేకాదు ముచ్చటగా మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశవాళీ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 'తీజే లంక' పక్షాన ఆడిన 34 ఏళ్ల మలింగ అనూహ్యంగా ఆఫ్-స్పిన్ బౌలింగ్ వేశాడు. అయితే ఇందుకు ఓ కారణం కూడా ఉంది. మైదానంలో సరిపడా వెలుతురు లేకపోవడంతో తొందరగా బౌలింగ్ చేయాలనే ఉద్దేశంతోనే మలింగ స్పిన్ బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. 22 పరుగులిచ్చి మూడు వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో మలింగ జట్టు డక్‌వర్త్ లూయిస్ విధానంలో 82 పరుగులతో విజయం సాధించింది. మలింగ స్పిన్ బౌలింగ్‌ను మీరు కూడా చూడొచ్చు.
Cricket
Sri Lanka
Lasit Malinga

More Telugu News