పవన్, నేను మూడు రోజుల పాటు మాట్లాడుకుంటూనే వున్నాం!: బ్రహ్మాజీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్, నేను మూడు రోజుల పాటు మాట్లాడుకుంటూనే వున్నాం!: బ్రహ్మాజీ

  • 'జానీ' సినిమాలో చిన్న పాత్ర చేశాను
  • అప్పటి నుంచే పవన్ తో పరిచయం 
  • నాతో బాగా మాట్లాడేవారు  
  • 'అన్నవరం' లో పాత్రను పవన్ స్వయంగా పిలిచి ఇచ్చారు    
"రవితేజతో కాకుండా ఏ హీరోతో మీరు ఎక్కువ క్లోజ్ గా వుంటారు? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బ్రహ్మాజీకి ఎదురైంది. ఆ ప్రశ్నకి సమాధానంగా ఆయన పవన్ కల్యాణ్ పేరు చెప్పారు. "పవన్ హీరోగా చేసిన 'జానీ' సినిమాలో నేను ఓ చిన్న పాత్రను పోషించాను. సాధారణంగా పవన్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. షూటింగ్ సమయంలో మేమిద్దరం కూర్చుని మూడు రోజుల పాటు మాట్లాడుకుంటూనే వున్నాం" అన్నారు.

 ఓ రోజున "ఏవయ్యా మా వాణ్ణి ఏం చేశావ్ .. మీ ఇద్దరూ కలిసి గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారని నాగబాబు చెబుతున్నాడు" అని చిరంజీవి గారు కూడా సరదాగా అడిగారు. 'జానీ' తరువాత పవన్ పిలిచి 'అన్నవరం' సినిమాలో ఫలానా పాత్ర చేస్తున్నావ్ అని చెప్పేసి తమిళ సినిమా సీడీని నా చేతిలో పెట్టారు". ఆయనతో చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి సాన్నిహిత్యం వుంది. ఆయన చాలా మంచి మనిషి .. రాజకీయాలకి సంబంధించిన వాళ్లతోనే రాజకీయాలు మాట్లాడతారు .. మిగతా వాళ్ల దగ్గర వాటి ప్రస్తావన తీసుకురారు" అంటూ చెప్పుకొచ్చారు.    
brahmaji

More Telugu News