నిర‌స‌న దీక్షకు దిగిన ప్రొ.కోదండ‌రామ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర‌స‌న దీక్షకు దిగిన ప్రొ.కోదండ‌రామ్!

  • ఉద్యోగాలను భ‌ర్తీ చేయడం లేదని కోదండ‌రామ్ ఆగ్ర‌హం
  • ఆందోళ‌న‌ల‌పై ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న
  • 24 గంట‌ల‌పాటు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం
తెలంగాణ వ‌చ్చి మూడున్న‌రేళ్లు అవుతున్నా ఉద్యోగాలను భ‌ర్తీ చేయడం లేదంటూ ప్ర‌భుత్వ వైఖ‌రికి వ్య‌తిరేకంగా పోరాడుతోన్న ప్రొ.కోదండ‌రామ్.. నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జ‌ర‌పడానికి అనుమ‌తుల కోసం ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. అయితే, అందుకోసం పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య వ్యతిరేక విధానాల‌కు పాల్ప‌డుతోంద‌ని కోదండ‌రామ్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 
ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా జ‌రపాల‌నుకుంటోన్న‌ ఆందోళ‌న‌ల‌పై ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న దీక్షకు దిగారు. ఈ రోజు హైద‌రాబాద్ తార్నాక‌లోని త‌న ఇంట్లోనే ఆయ‌న ఈ దీక్ష‌ను ప్రారంభించారు. త‌న దీక్ష 24 గంట‌ల పాటు కొన‌సాగుతుంద‌ని చెప్పారు. 
Kodandaram
Telangana

More Telugu News