ప్రీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'కేరాఫ్ సూర్య'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'కేరాఫ్ సూర్య'

  • సందీప్ కిషన్ తాజా చిత్రంగా 'కేరాఫ్ సూర్య'
  • కథానాయికగా మెహ్రీన్ 
  • తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు
'నా పేరు శివ'తో సక్సెస్ ను సాధించి .. దర్శకుడిగా తన సత్తా చాటుకున్న సుశీంద్రన్, తన తాజా చిత్రంగా 'కేరాఫ్ సూర్య' సినిమాను తెరకెక్కించాడు. సందీప్ కిషన్ .. మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నవంబర్ 2వ తేదీన జరపాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

 సాయిధరమ్ తేజ్ .. శర్వానంద్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొననున్నట్టు సమాచారం. సూర్య ఎవరు? ఆయన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలాంటివి? ఊహించని ఒక సంఘటన ఆయన జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? అనే ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమాకి, ఇమాన్ సంగీతాన్ని అందించాడు.    
sandeep kishan
mehreen

More Telugu News