అభిమానులు బాధపడకూడదనే అక్కినేని చివరి రోజుల్లో అలా చేశారు : డాక్టర్ కృష్ణక్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమానులు బాధపడకూడదనే అక్కినేని చివరి రోజుల్లో అలా చేశారు : డాక్టర్ కృష్ణక్క

  • అక్కినేని ఎప్పుడూ సరదాగానే ఉండేవారు 
  • చివరి రెండు నెలలు ఎవరినీ తన గదికి రానిచ్చేవారు కాదు 
  • కారణం అడిగితే చెప్పారు 
  • మనసున్న హీరో మా అన్నయ్య  
అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంతో తనకి గల అనుబంధాన్ని గురించి .. ఆయన చివరి రోజులను గురించిన విషయాలను, రచయిత్రి .. డాక్టర్ కృష్ణక్క (కృష్ణకుమారి) పాప్యులర్ టీవీతో పంచుకున్నారు. " ఎప్పుడూ పదిమందితో కలిసి సరదాగా నవ్వుతూ .. నవ్విస్తూ వుండే అక్కినేని, చివరి రెండు నెలలు తన గదిలోకి ఎవరినీ రానీయలేదు. ఎందుకు రానీయడం లేదని నేను అడిగితే .. అందుకు కారణాన్ని కూడా ఆయన నాకు చెప్పారు" అని అన్నారు.

 "నేనంటే అభిమానులకు ప్రాణం కదా .. వాళ్లు నన్ను ఈ  స్థితిలో చూస్తే గుండె బద్దలైపోతుంది. వాళ్లు అలా బాధపడుతూ వుంటే నేను భరించలేను. వాళ్లని బాధపెట్టడం ఇష్టం లేకనే ఎవరినీ రానీయడం లేదు" అని చెప్పారు. "చివరి క్షణాల్లో కూడా తన అభిమానులను గురించి ఆలోచించిన మనసున్న హీరో అన్నయ్య" అంటూ అక్కినేని గురించి ఆమె చెప్పుకొచ్చారు. 
krishnakka

More Telugu News