మహేష్ బాబు, కేసీఆర్... రాంగోపాల్ వర్మ 'వీపు సుందరులు'... చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేష్ బాబు, కేసీఆర్... రాంగోపాల్ వర్మ 'వీపు సుందరులు'... చూడండి!

  • ఎన్టీఆర్ స్వర్గం నుంచి లారీ అక్షింతలు చల్లుతాడు
  • నిర్మాత కేతిరెడ్డిని ఎద్దేవా చేసిన వర్మ
  • 'లక్ష్మీస్ వీరగ్రంథం' నటి వీపుపై కేసీఆర్, మహేష్ ఫొటోలు
నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరిట ఓ చిత్రం తీస్తున్నానని చెబుతూ, ఓ యువతి బ్యాక్ లెస్ గా ఉన్న పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టర్ లో కనిపిస్తున్న యువతి బ్యాక్ చాలా బాగుందని గతంలో వ్యాఖ్యానించిన రాంగోపాల్ వర్మ, ఇప్పుడు మరో వ్యంగ్య ట్వీట్ వేశాడు. "కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డికి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కన్నా 100 రెట్లు ఎక్కువ ఎక్స్ ట్రార్డినరీ స్క్రీన్ ప్రెజన్స్ వుంది. కేతి రెడ్డిని చూసాడంటే మహేష్ బాబు కూడా కుళ్ళు తో చచ్చిపోతాడు. 'లక్ష్మిస్ వీరగ్రంథం'లో వీరగంధం పాత్ర తను వేస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ. కేతిరెడ్డి హీరోగా వీరగంధం పాత్ర మరియు హీరోయిన్ గా ఒక సెక్సీ వీపు. వావ్!! సూపరో సూపరు. నందమూరి తారకరామారావు గారు స్వర్గం నుంచి ఒక లారీ లోడ్ అక్షింతలు కేతిరెడ్డి నెత్తి మీద చల్లడం ఖాయం" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించాడు. ఆ నటి వీపుపై తన ఫొటోతో పాటు మహేష్ బాబు, కేసీఆర్, ఎన్టీఆర్, కేతిరెడ్డి ఫొటోలు పెట్టి అదే పోస్టర్ ను రీ ట్వీట్ చేశాడు.
ram gopal varma
lakshmi's ntr
ketireddy

More Telugu News