నేరుగా కొడంగ‌ల్ వెళుతోన్న రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ స‌మక్షంలో వచ్చే నెలలో కాంగ్రెస్‌లోకి?
Add ap7am to your home Screen

నేరుగా కొడంగ‌ల్ వెళుతోన్న రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ స‌మక్షంలో వచ్చే నెలలో కాంగ్రెస్‌లోకి?

  • ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌ల‌తో రేవంత్ రెడ్డి చ‌ర్చ‌లు
  • మీడియాతో మాట్లాడ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని రేవంత్ రెడ్డి
  • వ‌చ్చేనెల కాంగ్రెస్ లోకి ఎంట్రీ 
శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేసిన‌ రేవంత్ రెడ్డి విజ‌య‌వాడ నుంచి నేరుగా త‌న నియోజ‌క వర్గ‌మైన కొడంగ‌ల్‌కు బ‌య‌లుదేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న సూర్యాపేట వ‌ద్ద ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొడంగ‌ల్‌లో రేవంత్ రెడ్డి త‌న మ‌ద్దతుదారుల‌తో కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఆయన మీడియాతో ఒక్క‌మాట కూడా మాట్లాడ‌డం లేదు.

మీడియాతో ఫోన్‌లో కూడా మాట్లాడ‌డానికి రేవంత్ రెడ్డి ఒప్పుకోవ‌డం లేదు. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో వ‌చ్చేనెలలో ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకోసం ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌ల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపినట్లు కొన్ని రోజుల క్రితం వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  
revant reddy
congress
l ramana
Telugudesam
chandrababu

More Telugu News