తెలంగాణ‌లో టీడీపీ ఉండి తీరాలి: రేవంత్ రెడ్డి
Add ap7am to your home Screen

తెలంగాణ‌లో టీడీపీ ఉండి తీరాలి: రేవంత్ రెడ్డి

  • తెలంగాణ‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు అసంతృప్తితో ఉన్నారు
  • కేసీఆర్‌పై పోరాటం కొన‌సాగిస్తా
తెలంగాణ‌లో టీడీపీ ఉండి తీరాలని కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీకి, ఆ పార్టీ ప‌ద‌వుల‌కి రాజీనామా చేస్తూ ఈ రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి రేవంత్ రెడ్డి లేఖ‌ స‌మ‌ర్పించిన విష‌యం తెలిసిందే. ఆ లేఖ‌లో ఏపీ, తెలంగాణ‌లోని ప‌లువురు టీడీపీ నేత‌లపై రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొంత‌మంది నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు బాగోలేద‌ని అన్నారు. త‌మ పార్టీ అధ్యక్షుడు చంద్ర‌బాబుపై త‌న‌కు ఎంతో గౌర‌వం ఉందని పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న‌పై గౌర‌వం ఇలాగే కొన‌సాగుతుంద‌ని చెప్పారు. తెలంగాణ‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు అసంతృప్తితో ఉన్నారని లేఖ‌లో పేర్కొన్నారు. కేసీఆర్‌పై త‌న పోరాటం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. 
revant reddy
congress
Telugudesam
chandrababu

More Telugu News