కృష్ణవంశీ అప్పటికి భోజనం చేయక రెండు రోజులు అయిందట : నటుడు బ్రహ్మాజీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణవంశీ అప్పటికి భోజనం చేయక రెండు రోజులు అయిందట : నటుడు బ్రహ్మాజీ

  • అవకాశాల కోసం నేను కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నాం 
  • నాకు ఇంటి నుంచి డబ్బులు వచ్చేవి 
  • కృష్ణవంశీ తెప్పించుకునేవాడు కాదు
చెన్నైలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పటి సంగతులను ఐ డ్రీమ్స్ తో బ్రహ్మాజీ పంచుకున్నారు. 'నిన్నే పెళ్లాడుతా' సినిమా షూటింగ్ సమయంలో కృష్ణవంశీ నాకు మాట ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయితే నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానని అన్నాడు. "నీ రుణం తీర్చుకోవాలి" అన్నాడు. నాకు తెలియకుండా నేను చేసిన చిన్న సాయం వలన ఆయన అలా అన్నాడు".

" కృష్ణవంశీ .. నేను సినిమాల్లో చాన్సుల కోసం స్ట్రగుల్ అవుతోన్న సమయంలో నాకు ఇంటి దగ్గర నుంచి డబ్బులు వచ్చేవి. కృష్ణవంశీ ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకునేవాడు కాదు. పాండి బజార్లో ఒక హోటల్ ఉండేది. అందులో నేను మంత్లీ టికెట్స్ తీసుకుని భోజనం చేసేవాడిని. ఒక రోజు రాత్రి నేను భోజనానికి వెళుతూ తనని కూడా తీసుకెళ్లాను. ఇద్దరం భోజనం చేశాం .. అప్పటికి తాను భోజనం చేయక రెండు రోజులైందనే విషయం, ఆ తరువాత కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో చెబితేనే నాకు తెలిసింది" అంటూ చెప్పుకొచ్చారు.    
brahmaji

More Telugu News