చంద్రబాబు నాకు పవర్స్ ఇచ్చారు... ఏ నిర్ణయమైనా నాదే: ఎల్.రమణ
- తెలంగాణకు సంబంధించినంత వరకూ పూర్తి అధికారాలు ఇచ్చారు
- రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నడూ ప్రకటించలేదు
- ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే
ముందుగా అనుకున్న ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు టీడీపీ, బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని, దీనికి రావాలని రేవంత్ కు సమాచారాన్ని పంపామని, వచ్చేది, రానిదీ ఆయన ఇష్టమని తెలిపారు. తమ అధినేత వచ్చిన తరువాత అన్ని విషయాలను ఆయనతో చర్చించి రేవంత్ పై తుది నిర్ణయం తీసుకుంటామని రమణ పేర్కొన్నారు.