సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • అవార్డుల కోసం సినిమాలు చేయనంటున్న అనుష్క 
  • తదుపరి చిత్రం పనుల్లో పడిన మురుగదాస్
  • జనవరి నుంచి శ్రీను వైట్ల, రవితేజ చిత్రం
  • శ్రీకాంత్ హీరోగా నటించిన 'రా..రా'
*  'అవార్డుల కోసం సినిమాలు చేయలేమండీ..' అంటోంది అందాలతార అనుష్క. "ఒక సినిమాలో మన నటన బాగుండి అవార్డు వస్తే సంతోషమే. అలాగని చెప్పి అవార్డుల కోసమే సినిమాలు చేయలేం. అవార్డులు రాకపోయినా ఫలానా 'సినిమాలో మీరు బాగా నటించారండీ' అంటూ ఎవరైనా ప్రశంసిస్తే అది అవార్డు కిందే లెక్క" అని చెప్పింది అనుష్క.
*  'మెర్సల్' తర్వాత విజయ్, 'స్పైడర్' తర్వాత మురుగదాస్ కలసి ఓ చిత్రాన్ని చేయడానికి నిర్ణయించుకున్న సంగతి విదితమే. ఇప్పుడు వీరిద్దరూ కూడా ఈ చిత్రంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి గిరీష్ గంగాధరన్ కెమెరామేన్ గా ఎంపికయ్యారు.
*  రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో గతంలో పలు హిట్స్ వచ్చాయి. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే జనవరిలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
*  సీనియర్ హీరో శ్రీకాంత్ కథానాయకుడుగా నటించిన 'రా..రా' చిత్రం వచ్చే నెల 17న రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. నజియా, సీతా నారాయణ ఇందులో హీరోయిన్లుగా నటించారు.   
anushka
vijay
raviteja

More Telugu News