'టక్కరి దొంగ' భారీ ప్లాప్ .. అప్పులు తీర్చడానికి నాలుగేళ్లు పట్టింది : దర్శకుడు జయంత్ సి.పరాన్జీ
- దర్శకుడిగా భారీ హిట్స్ ఇచ్చిన జయంత్ సి.పరాన్జీ
- ఎలాంటి మెంటల్ టెన్షన్స్ పెట్టుకోను
- ఎప్పుడూ హ్యాపీగా వుంటాను
- భారీగా నష్టం వచ్చినా అలాగే వున్నాను
" ఏ విషయంలోను మెంటల్ టెన్షన్ తీసుకోను .. సినిమా ప్లాప్ అయినా అది అంతగా నాపై ప్రభావం చూపించదు" అని జయంత్ అన్నారు. " 'టక్కరి దొంగ' సినిమా భారీ నష్టాన్ని తీసుకొచ్చింది .. అప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గానే వున్నాను. ఏంటి .. ఇలా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది అడిగారు. కానీ ఏం చేస్తాం .. అలా జరిగిపోయింది. ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోకుండా 'ఈశ్వర్' షూటింగుకి వెళ్లిపోయాను. 'టక్కరి దొంగ' ప్లాప్ కావడంతో ఆ అప్పులు తీర్చడానికి నాలుగేళ్లు పట్టింది" అని చెప్పుకొచ్చారు.