పవన్ తో మల్టీ స్టారర్ చేయాలనుంది: రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ తో మల్టీ స్టారర్ చేయాలనుంది: రవితేజ

  • 'రాజా ది గ్రేట్'తో మంచి మార్కులు కొట్టేసిన రవితేజ 
  • తదుపరి చిత్రంగా 'టచ్ చేసి చూడు' 
  • లైన్లో మరో రెండు మూడు ప్రాజెక్టులు    
ఆ మధ్య రవితేజ కొన్ని ప్రాజెక్టులను ఒప్పుకోవడం .. చివరివరకూ వచ్చి కొన్ని కారణాల వలన అవి పట్టాలెక్కకపోవడం జరిగింది. దాంతో అనుకోకుండానే ఆయనకి గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ తరువాత వచ్చిన 'రాజా ది గ్రేట్' ఆయనకి కాస్త ఊరటనిచ్చిందేనని చెప్పాలి. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా మంచి మార్కులనే కొట్టేసింది.

 ఈ నేపథ్యంలో "తెలుగులో ఏ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఇష్టపడతారు?" అనే ప్రశ్న ఆయనకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. "పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలని వుంది. ఆయన కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చుతుంది. మా ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందనేది నా అభిప్రాయం" అంటూ రవితేజ తన మనసులోని మాటను బయటపెట్టాడు. రవితేజ కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం 'టచ్ చేసి చూడు' సినిమాపై దృష్టి పెట్టిన ఆయన, మరో రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు.    
raviteja

More Telugu News