హిజ్బుల్ చీఫ్ సలావుద్దీన్ కుమారుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల బట్వాడా
- సిరియా నుంచి వచ్చిన డబ్బుతో ఉగ్రవాదం
- 2011లో పెట్టిన కేసులో భాగంగా అరెస్ట్
- మరో ఇద్దరి కోసం గాలిస్తున్న ఎన్ఐఏ
కాగా, 2011లో పెట్టిన కేసు విచారణలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సిరియాకు చెందిన గులామ్ మొహమ్మద్ భట్ నుంచి డబ్బు యూసుఫ్ కు వచ్చిందని, దీని వెనుక సలాహుద్దీన్ ఉన్నాడని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఆ డబ్బును 2011 నుంచి 2014 వరకూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని తెలిపారు. ఇదే కేసులో ప్రమేయమున్న మొహమ్మద్ మక్బూల్ పండిట్, అజీజ్ అహ్మద్ భట్ లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.