పవన్ కోసం పవర్ఫుల్ స్టోరీని రెడీ చేస్తోన్న క్రిష్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కోసం పవర్ఫుల్ స్టోరీని రెడీ చేస్తోన్న క్రిష్!

  • వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా క్రిష్ 
  • ప్రస్తుతం 'మణికర్ణిక' షూటింగులో బిజీ 
  • పవన్ తో ఓ సినిమా చేయాలనే పట్టుదల    
తెలుగు దర్శకులలో క్రిష్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. గమ్యం .. వేదం .. కంచె .. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలు దర్శకుడిగా ఆయన అభిరుచికి అద్దం పడతాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో 'మణికర్ణిక' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత పవన్ కల్యాణ్ కి ఒక కథ వినిపించడానికి ఆయన సిద్ధమవుతున్నాడని అంటున్నారు.

 'కంచె' సినిమా కంటే ముందుగానే పవన్ తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో క్రిష్ గట్టి ప్రయత్నాలే చేశారు గానీ అవి ఫలించలేదు. అయితే ఈ సారి మాత్రం పవన్ కి తప్పకుండా కథ వినిపించాలనీ .. ఆయనని ఒప్పించాలనే పట్టుదలతో క్రిష్ వున్నాడని అంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఆయన పవన్ సినిమాకి సంబంధించిన కథపైనే కూర్చుంటున్నారని చెబుతున్నారు. ఈ సారైనా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి మరి.      
krish

More Telugu News