నా పాత్ర రెచ్చగొట్టేలా ఏమీ వుండదు!: జబర్దస్త్ రష్మీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా పాత్ర రెచ్చగొట్టేలా ఏమీ వుండదు!: జబర్దస్త్ రష్మీ

  • ఆదితో కలిసి ‘నెక్ట్స్‌ నువ్వే’ సినిమాలో నటించిన రష్మీ గౌతమ్
  • కొంతమంది హీరోయిన్లు చేసే ఎక్స్ పోజింగ్ లో నేను 30 శాతం కూడా చేయడం లేదు
  • బికినీ అందరికీ నప్పదు..నా దేహం బికినీకి అనువుగా ఉంటుంది
చాలా రోజుల తర్వాత చీర కట్టుతో సంప్రదాయబద్ధమైన పాత్రలో నటించానని జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్‌ తెలిపింది. ఆది కధానాయకుడిగా, రష్మీ కీలకపాత్రలో నటించిన ‘నెక్ట్స్‌ నువ్వే’ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో రష్మి మాట్లాడుతూ, సినిమా ట్రైలర్‌ చూసి తన పాత్ర గ్లామరస్‌ గా ఉంటుందని అనుకుంటున్నారని చెప్పింది. కానీ, తన పాత్ర రెచ్చగొట్టేలా ఉండదని, కానీ ఎనర్జిటిక్‌ గా ఉంటుందని చెప్పింది.

'సినిమాల్లో అసభ్యకర దుస్తులు వేస్తున్నారేంటి?’ అని చాలా మంది అడుగుతున్నారని, అయితే, తాను ఎక్స్ పోజింగ్ చేయడం లేదని, సినిమాలో కథ, సందర్భాన్ని బట్టి దుస్తుల ఎంపిక ఉంటుందని చెప్పింది. ఇతర హీరోయిన్లతో పోలిస్తే తాను వారిలో కనీసం 30 శాతం కూడా ఎక్స్‌ పోజ్‌ చేయడం లేదని వివరించింది.

సినిమాకు సంతకం చేసేముందే సౌకర్యంగా ఉండే దుస్తులే ధరిస్తానని చెబుతానని తెలిపింది. పాత్ర పరిధి మేరకు అవసరమైన మేర నటిస్తానని రష్మీ తెలిపింది. తనపై వచ్చే కామెంట్ల గురించి పట్టించుకోనని పేర్కొంది. సినీ రంగంలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నానని చెప్పింది.

‘గుంటూర్‌ టాకీస్‌’తో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపిన రష్మీ, 'నాకు సింగిల్ హీరోయిన్ సినిమాల్లోనే అవకాశం ఇవ్వండి' అని అడగడం లేదని చెప్పింది. ఇద్దరు, ముగ్గురు కథానాయికలు ఉన్న సినిమాల్లో కూడా నటించేందుకు సిద్ధమని తెలిపింది. బికినీలు ధరించడానికి అనువైన శరీరం తనదని చెప్పింది. చాలా మందికి అలాంటి శరీరం ఉండదని తెలిపింది. 
rashmi
aadi
next nuvve
movie
exposing

More Telugu News