Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాలు వదిలేశాను.. నేను కొత్త జీవితం మొదలు పెట్టాను!: రిచా గంగోపాధ్యాయ

  • 2013లోనే సినిమాలను వదిలేశాను
  • ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టాను
  • ఈ జీవితంలో నటన అనే అంశమే లేదు
సినిమాలను వదిలేశానని 'లీడర్' ఫేమ్ రిచా గంగోపాధ్యాయ తెలిపింది. ‘లీడర్‌’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రిచా ఆ తరువాత ‘మిర్చి’, ‘సారొచ్చారు’, ‘మిరపకాయ్‌’, ‘నాగవల్లి’, ‘భాయ్‌’ వంటి సినిమాల్లో నటించి, 2013లో ఉన్నత విద్య కోసం సినీ పరిశ్రమను వదిలి వెళ్లింది. అయితే విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తుందని అప్పట్లో వార్తలువచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తారు? ఏవైనా స్టోరీలు విన్నారా? కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి? వంటి ప్రశ్నలను అభిమానులు ఆమెపై సంధిస్తున్నారు.

దీంతో తనను కొత్త సినిమా గురించి అడిగిన వారందరికీ రిచా ఒక స్పష్టమైన సమాధానం చెప్పింది. తాను సినిమాలను ఐదేళ్ల క్రితం అంటే 2013లో వదిలేశానని తెలిపింది. ఇప్పుడు తాను కొత్త జీవితంలో అడుగుపెట్టానని తెలిపింది. అందులో నటన అనే అంశమేలేదని స్పష్టం చేసింది. దీంతో ఇకపై సినిమాల్లో కనిపించనని స్పష్టంగా అభిమానులకు చెప్పింది. కాగా, రిచా వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 
richa gangopadhyay
leader
actress

More Telugu News