ఆ పుకార్లను నా భార్య నమ్మలేదు!: దర్శకుడు రేలంగి నరసింహారావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ పుకార్లను నా భార్య నమ్మలేదు!: దర్శకుడు రేలంగి నరసింహారావు

  • అశ్వనితో వరుస సినిమాలు చేశాను 
  • అందుకే అలా అనుకున్నారు 
  • ఆ పుకారు పేపర్లోను వచ్చేసింది
  • అలా మా ఆవిడ క్లారిటీ ఇచ్చేసింది  
రేలంగి నరసింహారావు పేరు వినగానే హాస్యభరితమైన ఎన్నో సినిమాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాల్లోని మరిచిపోలేని కొన్ని సన్నివేశాలు మళ్లీ కితకితలు పెడతాయి. అలాంటి రేలంగి నరసింహారావు దర్శకుడిగా ఫుల్ బిజీగా వున్న సమయంలో .. అప్పట్లో కథానాయికగా వున్న అశ్వనికి, ఆయనకి మధ్య ఎఫైర్ ఉందంటూ ప్రచారం జరిగింది. తాజాగా తెలుగు పాప్యులర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకి ఇదే ప్రశ్న ఎదురైంది.

"అశ్వనీ కథానాయికగా రెండు మూడు సినిమాలు ఏఆర్ గార్డెన్స్ లో షూటింగ్ చేయడంతో, ఏ ఆర్ అంటే .. అశ్వని - రేలంగి నరసింహారావు అనుకున్నారు. మా మధ్య ఎఫైర్ ఉందనే విషయం పేపర్లో కూడా వచ్చేసింది. ఆ పేపర్ కటింగ్ తీసుకుని దూరపు బంధువు ఒకావిడ నా భార్య దగ్గరికి వచ్చింది. అన్నయ్య చూశారా .. ఇలా చేశాడంటూ .. ఆ పేపర్ కటింగ్ నా భార్యకు చూపించింది. ఆ పేపర్ కటింగ్ చూసి మా ఆవిడ పకపకమని నవ్వింది.

"ఏఆర్ గార్డెన్స్ అంటే .. అంబిక - రాధ ల గార్డెన్ .. ఆ అక్కా చెల్లెళ్లు కలిసి ఆ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు" అని చెప్పింది. అంతేకాదు .. "మా ఆయనకి అంత ధైర్యం కూడా లేదని చెప్పేసింది" అంటూ నవ్వేశారు.                           
relangi narasimha rao

More Telugu News