ప్రపంచం కోసం నా జీవన శైలి ఎందుకు మార్చుకోవాలి?: రాధే మా
- 20 ఏళ్లు వచ్చేసరికే ఇద్దరు పిల్లలకు తల్లిని
- భర్త వదిలేశాడు
- రామ్ రహీమ్ గురించి మాట్లాడేందుకు నిరాకరణ
తాను చిన్నగా ఉన్నపుడే తల్లి చనిపోవడంతో తండ్రి తనకు 17 ఏళ్ల వయసున్నపుడే పెళ్లి చేశాడని తెలిపింది. దీంతో 20 ఏళ్లు వచ్చేసరికి తాను ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానని పేర్కొంది. తర్వాత భర్త కూడా వదిలేసి వెళ్లిపోయాడని రాధే మా చెప్పింది. అప్పుడు పడిన కష్టాలే తనను ఆధ్యాత్మికం వైపు మళ్లేలా చేశాయని చెప్పుకొచ్చింది. తన మీద వచ్చిన వివాదాలు, కేసుల గురించి మాట్లాడుతూ - `వాళ్లందరూ డబ్బు కోసమే నా పేరును వాడుకున్నారు` అని అంది. అత్యాచారం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్ గుర్మీత్ సింగ్ గురించి ప్రస్తావించగా... ఇతరుల విషయాలపై తాను స్పందించనని చెప్పింది.