గుజరాత్ సీఎంపై బిలియనీర్ ను నిలిపిన కేజ్రీవాల్... అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితా విడుదల!
- 11 మందితో తొలి జాబితాను ప్రకటించిన ఆప్
- సీఎం విజయ్ రూపానీపై పోటీకి రాజేశ్ భట్
- త్వరలోనే మరో జాబితా!
విజయ్ పై విజయం సాధించే అన్ని అర్హతలూ రాజేశ్ కు ఉన్నాయని ఈ సందర్భంగా ఆప్ గుజరాత్ ఎన్నికల ఇన్ చార్జ్ గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ ఉదయం తొలి జాబితాను విడుదల చేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ జాబితాను ఖరారు చేశామని తెలిపిన ఆయన, రెండో జాబితా అతి త్వరలోనే విడుదలవుతుందని తెలిపారు.