గురువారం జరగాల్సిన హీరోయిన్ భావన పెళ్లి వాయిదా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గురువారం జరగాల్సిన హీరోయిన్ భావన పెళ్లి వాయిదా!

  • 26న ప్రియుడు నవీన్ తో పెళ్లి నిశ్చయం
  • అనూహ్యంగా పెళ్లిని వాయిదా వేసుకున్న భావన
  • స్వయంగా వెల్లడించిన భావన
  • చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాకనే పెళ్లి?
  • లేక మరేదైనా కారణమా?
ప్రముఖ దక్షిణాది హీరోయిన్, కొంతకాలం క్రితం లైంగిక వేధింపులకు గురైన భావన, తన వివాహాన్ని వాయిదా వేసుకుంది. ప్రియుడు నవీన్ తో పెళ్లికి సిద్ధమై, నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకుని, 26వ తేదీన పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఒకటవ్వాలని నిర్ణయించుకున్న ఈ జంట అనూహ్యంగా ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని భావనే స్వయంగా వెల్లడించింది.

పెళ్లి వాయిదా కారణాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. చేతిలో ఉన్న కొన్ని చిత్రాలను పూర్తి చేయాల్సి వున్నందునే పెళ్లిని వాయిదా వేసుకున్నారా? లేక ఇతర కారణమేదైనా ఉందా? అని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కాగా, భావనపై లైంగిక వేధింపులకు కారకుడైన దీలీప్, బెయిలు మీద జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
bhavana
naveen
marriage

More Telugu News