చివరి షెడ్యూల్ లో అఖిల్ సినిమా .. చాలా ఎగ్జైట్ మెంట్ గా ఉందట!

అఖిల్ రెండవ సినిమాగా 'హలో' రూపొందుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ విషయాన్ని అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు. షూటింగ్ పరంగా సినిమా ముగింపు దశకి చేరుకోవడం .. విడుదల తేదీ దగ్గరలోనే ఉండటంతో చాలా ఎగ్జైట్ మెంట్ గా ఉందని అన్నాడు.

 మొదటి సినిమా ఫలితం నుంచి తేరుకోవడానికి అఖిల్ కి కొంత సమయం పట్టింది. ఆ తరువాత మంచి కథను ఎంపిక చేసుకోవడానికి మరికొంత సమయం పట్టింది. ఈ కారణంగా చాలా గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం వలన, అఖిల్ ఎగ్జైట్ మెంట్ తో వున్నాడన్న మాట. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో, కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
akhil
vikram kumaar

More Telugu News