'మలయాళీ' అనడంతోనే సాయిపల్లవికి కోపం వచ్చిందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మలయాళీ' అనడంతోనే సాయిపల్లవికి కోపం వచ్చిందట!

  • సాయిపల్లవి ఫస్ట్ మూవీ మలయాళంలో 'ప్రేమమ్'
  • దాంతో మలయాళీగానే ప్రచారం 
  • ఈ విషయం పట్ల ఆమె అసహనం 
  • తమిళ అమ్మాయినంటూ స్పష్టం    
తెలుగు తెరకి 'ఫిదా' చిత్రంతో పరిచయమైన సాయిపల్లవి, ఆ సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేస్తోన్న సాయిపల్లవి, శర్వానంద్ సరసన కూడా ఒక సినిమా చేయనుంది. ఇక తమిళంలోను రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో వున్నాయి.

ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి .. ఓ తమిళ హీరోతో క్లోజ్ గా ఉంటోందనే వార్తలు జోరందుకున్నాయి. మీడియాలోను ఈ వార్త షికారు చేస్తోంది. తాను ఓ తమిళ హీరోతో క్లోజ్ గా వుంటున్నానంటూ మీడియాలో వస్తోన్న వార్తలను సాయిపల్లవి పెద్దగా పట్టించుకోలేదు కానీ, తాను మలయాళీనంటూ మీడియా పేర్కొనడంపైనే ఆమెకు కోపం వచ్చిందట.

తాను తమిళ అమ్మాయిననీ .. అలాగే ట్రీట్ చేయమని కోరింది. సాయిపల్లవి ఫస్టు మూవీ మలయాళంలో 'ప్రేమమ్' కావడంతో, అంతా ఆమె మలయాళీ అనుకున్నారు .. అక్కడొచ్చింది అసలైన చిక్కు.      
saipallavi

More Telugu News