సూర్య చేతుల మీదుగా 'కేరాఫ్ సూర్య' ఆడియో రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూర్య చేతుల మీదుగా 'కేరాఫ్ సూర్య' ఆడియో రిలీజ్!

  • తెలుగు .. తమిళ భాషల్లో 'కేరాఫ్ సూర్య' 
  • వచ్చేవారం ఆడియో ఫంక్షన్ 
  • త్వరలో ట్రైలర్ రిలీజ్ 
  • నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు  
తెలుగు .. తమిళ భాషల్లో సరైన హిట్ కోసం సందీప్ కిషన్ కొంతకాలంగా వెయిట్ చేస్తున్నాడు. రెండు భాషల్లోను తాను ఆశించే హిట్ ను ఒకేసారి 'కేరాఫ్ సూర్య' ఇస్తుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన తాజా చిత్రంగా సుశీంద్రన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. సందీప్ కిషన్ సరసన కథానాయికగా మెహ్రీన్ కనిపించనుంది. ఈ సినిమా 'టైటిల్ లోగో'ను హీరో సూర్యతో రిలీజ్ చేయించిన టీమ్, ఆడియోను కూడా వచ్చేవారం ఆయన చేతుల మీదుగానే విడుదల చేయించనున్నారు.

 ఈ ఫంక్షన్ కి సూర్య ముఖ్య అతిథిగా వస్తుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి .. నవంబర్ 10వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకూ యాక్షన్ సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన సందీప్ కిషన్, ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీని కూడా అద్భుతంగా చేశాడని అంటున్నారు. ఈ సినిమాతో సందీప్ కిషన్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.     
sandeep kishan
mehreen

More Telugu News