నెల్లూరు జిల్లాలో... సర్పంచ్ ఇంటికెళ్లి అత్యాచారయత్నం చేసిన ఎస్సై!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెల్లూరు జిల్లాలో... సర్పంచ్ ఇంటికెళ్లి అత్యాచారయత్నం చేసిన ఎస్సై!

  • నెల్లూరు జిల్లా సైదాపురం ఎస్సై ఏడుకొండలు కీచకపర్వం
  • వూటుకూరు సర్పంచ్ పద్మజపై కన్నేసిన ఎస్సై 
  • నాలుగు నెలలుగా వేధింపులకు పాల్పడుతున్న వైనం 
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎస్సై ఏకంగా సర్పంచ్ పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని, అతనిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటన వివరాల్లోకి వెళ్తే... జిల్లాలోని సైదాపురం ఎస్సై ఏడుకొండలు వూటుకూరు సర్పంచ్ పద్మజపై కన్నేశాడు. నాలుగు నెలలుగా ఆమెను సెల్ ఫోన్ ద్వారా అసభ్యకర పదజాలంతో వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఈ క్రమంలో దీపావళి సందర్భంగా వూటుకూరు వచ్చిన ఏడుకొండలు, పద్మజ నివాసానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో భయబ్రాంతులకు గురైన పద్మజ అతని బారినుంచి తప్పించుకుని, ఇరుగుపొరుగు మహిళల సాయంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఆయనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన మహిళా సంఘాలు ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే, సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని, తక్షణం ఎస్సై ఏడుకొండలును విధుల నుంచి తప్పించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. 
rape attempt
si
surpunch
compliant on si

More Telugu News