అందుకే మా అబ్బాయి చేయడానికి ఒప్పుకున్నా : రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే మా అబ్బాయి చేయడానికి ఒప్పుకున్నా : రవితేజ

  • 'రాజా ది గ్రేట్' కి సూపర్ రెస్పాన్స్ 
  • రవితేజ చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు మహాధన్ 
  • మహాధన్ ను తీసుకోవడానికి కారణమదే 
  • బాగా చేయించిన క్రెడిట్ అనిల్ దే!
రవితేజ కథానాయకుడిగా చేసిన 'రాజా ది గ్రేట్' నిన్ననే భారీస్థాయిలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి .. హీరో రవితేజ .. కథానాయిక మెహ్రీన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రను ఆయన తనయుడు 'మహాధన్' పోషించాడు. హీరో చిన్నప్పటి పాత్రను .. పెద్దయ్యాక పాత్రను చూపించవలసి రావడంతో, పోలికలు కలవాలి కనుక రవితేజ తనయుడిని ఎంపిక చేసుకోవడం జరిగిందని అనిల్ రావిపూడి అన్నాడు. మహాధన్ ను ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు దర్శకులు అడిగారనీ .. కానీ తాను ఒప్పుకోలేదని రవితేజ చెప్పాడు. తన చిన్నప్పటి పాత్ర అవడం వలన .. ఆ పాత్రకి ప్రాధాన్యత ఉండటం వలన .. అనిల్ రావిపూడిపై గల నమ్మకంతోను అంగీకరించానని అన్నాడు. మహాధన్ తో అనిల్ చాలా బాగా చేయించాడంటూ రవితేజ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 
raviteja
mehreen

More Telugu News