యూఎస్ వెళ్లొచ్చాక వర్మతో యాక్షన్ మూవీ చేస్తా!: నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూఎస్ వెళ్లొచ్చాక వర్మతో యాక్షన్ మూవీ చేస్తా!: నాగార్జున

  • ఓ వైపున చైతూ ప్రాజెక్టులపై నాగ్ శ్రద్ధ 
  • మరో వైపున అఖిల్ మూవీ వ్యవహారాలు 
  • 'రాజుగారి గది 2' సక్సెస్ పట్ల ఆనందం 
  • యాక్షన్ మూవీ చేయాలనే ఉత్సాహం
ఒక వైపున నాగచైతన్య ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు .. మరో వైపున అఖిల్ సినిమాలకి సంబంధించిన వ్యవహారాలను నాగార్జున దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సమయంలోనే తన తదుపరి సినిమాలపైన కూడా ఆయన దృష్టి పెట్టారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తొలిసారి చేసిన 'రాజుగారి గది 2' సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకోవడంతో ఆయన ఎంతో ఉల్లాసంగా వున్నారు.

 ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ .. "కొంతకాలంగా వరుసగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ .. ఎమోషనల్ మూవీస్ చేస్తూ వచ్చాను. దాంతో బాగా బోర్ కొట్టేసింది. ఒక యాక్షన్ మూవీ చేస్తే బాగుంటుందని భావించాను. అదే సమయంలో నాకు వర్మ ఒక స్క్రిప్ట్ పంపించాడు. అది పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్యంలో కొనసాగుతుంది. కథ బాగా నచ్చేయడంతో వెంటనే ఓకే చెప్పేశాను. మానసిక పరమైన వత్తిడి నుంచి బయటపడటానికి నేను ఓ పదిరోజుల పాటు యూఎస్ కి వెళుతున్నాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక వర్మతో సినిమా మొదలవుతుంది" అని నాగార్జున చెప్పారు.   
nagarjuna

More Telugu News