ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్!
- ప్రియుడితో కలిసి దేవాలయానికి వెళ్లిన యువతి
- పూజలు చేసి తిరిగి వస్తుండగా అటకాయించిన ఆరుగురు దుండగులు
- ప్రియుడిని కొట్టి, ప్రియురాలిని జీడితోటలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రియుడిపై దాడి చేశారు. అనంతరం వారిద్దరినీ దగ్గర్లోని జీడితోటలోకి లాక్కెళ్లి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి తెగబడడమే కాకుండా, అదేదో ఘనకార్యమైనట్టు సెల్ ఫోన్లలో వీడియో కూడా తీశారు. దారుణం అనంతరం వారిద్దరినీ అక్కడే వదిలేయగా, వారిద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, ఆరుగురు కీచకులను అరెస్టు చేశారు.