Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వంద మందితో దీపావళి జరుపుకుంటున్నానంటున్న హీరోయిన్ హన్సిక!

  • ముంబైలో దీపావళి చేసుకుంటున్న హన్సిక
  • షూటింగ్ లో బ్రేక్ రావడంతో సంబరాలకు ఇంటికి వెళ్లిన హన్సిక
  • దత్తత పిల్లలు, స్నేహితులు, బంధువులతో కలిసి దీపావళి వేడుకలు 
వందమంది అతిథులతో దీపావళి పండుగ జరుపుకుంటానని సినీ నటి హన్సిక తెలిపింది. హీరోయిన్ గా తెలుగు నాట అడుగు పెట్టిన హన్సిక, కోలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా కొనసాగుతోంది. దీపావళిని పురస్కరించుకుని స్వస్థలం ముంబై వెళ్లిన ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ, పండుగల సమయంలో షూటింగ్‌ కి బ్రేక్‌ దొరికితే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పింది. ఈ ఏడాది తనకు ఆ అవకాశం లభించిందని చెప్పింది.

స్నేహితులు, బంధువులు మొత్తం అంతా కలిసి ఓ వందమంది వరకు తమ ఇంటికి వచ్చారని చెప్పింది. తామంతా చాలా గ్రాండ్ గా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పింది. తన కోసం తన తల్లి గాగ్రా ఛోళీ, లంగా ఓణి కొన్నారని చెప్పింది. నిన్న కూడా పూజలు చేశామని, ఈ రోజు లక్ష్మీ పూజ అనంతరం దీపావళి సంబరాలు ఉంటాయని చెప్పింది. ఇక ఈ రోజు తాను దత్తత తీసుకున్న పిల్లల దగ్గరకి వెళ్లి, వారితో కొంత సమయం గడిపి, వారిని ఉల్లాసపరిచి, ఇంటికి వస్తానని, అనంతరం ఇంట్లో దీపావళి ఘనంగా జరుపుకుంటామని చెప్పింది. 
hanshka
diwali
mumbai
celebrations

More Telugu News