కొత్త సినిమా కోసం.. భళ్లాల దేవుడితో కలిసిన కట్టప్ప .. బిజ్జలదేవుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త సినిమా కోసం.. భళ్లాల దేవుడితో కలిసిన కట్టప్ప .. బిజ్జలదేవుడు!

  • తమిళంలో రానా చిత్రంగా 'మదై తిరందు'
  • తెలుగు టైటిల్ గా '1945' 
  • కేరళలో షూటింగ్
రానా అనే పేరు వినగానే 'బాహుబలి'లోని 'భళ్లాలదేవుడు' పాత్ర కళ్ల ముందు కదలాడుతుంది. అంతగా ఆయన ఆ పాత్రతో ప్రేక్షకులను ప్రభావితం చేశాడు. ప్రస్తుతం ఆయన 'మదై తిరందు' అనే తమిళ సినిమా చేస్తున్నాడు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమా, షూటింగు దశలో వుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది.

 రానా .. సత్యరాజ్ .. నాజర్ కాంబినేషన్లోని కొన్ని సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 'బాహుబలి'లో 'కట్టప్ప' పాత్రలో సత్యరాజ్ .. 'బిజ్జలదేవుడు' పాత్రలో నాజర్ ఎంతగా ఆడియన్స్ ను మెప్పించారో తెలిసిందే. వాళ్లతో కలిసి రానా చేస్తోన్న ఈ సినిమా .. సహజంగానే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెజీనా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను .. '1945' పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ రెండు భాషల్లో తనకి ఈ సినిమా మరింత క్రేజ్ ను తీసుకువస్తుందనే నమ్మకంతో రానా వున్నాడు.
rana

More Telugu News