జీన్స్, హై హీల్స్ ధరించిన మలాలా... విరుచుకుపడిన పాకిస్థానీ నెటిజన్లు
- పాకిస్థానీ నటితో పోలికలు
- పరువు తీసిందంటూ వ్యాఖ్యలు
- అండగా నిలిచిన ఇతర దేశాల నెటిజన్లు
`మొదట చూడగానే నటి మియా ఖలీఫా అనుకున్నా!`, `త్వరలోనే పాకిస్థాన్‌కి భూకంపం వస్తుంది`, `ఇక ఆ తల మీది వస్త్రం వదిలించుకునే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి` అంటూ కామెంట్లు చేశారు. పిచ్చిపట్టిందని, తమ దేశం పరువు తీసిందని వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. అసభ్య కామెంట్లకు గట్టిగా సమాధానం చెప్పారు. `మీరు ఇక మారరు!`, `ఆమెకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా?`, `ఇన్నాళ్లకు మలాలాకు స్వాతంత్ర్యం వచ్చింది!` అంటూ భరోసా ఇచ్చారు.