దీపావ‌ళి సంద‌ర్భంగా 'స్కైప్ లైట్‌'కి కొత్త ఫీచ‌ర్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దీపావ‌ళి సంద‌ర్భంగా 'స్కైప్ లైట్‌'కి కొత్త ఫీచ‌ర్‌!

  • అందుబాటులోకి గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచ‌ర్
  • అప్‌డేట్ ప్ర‌క‌టించిన మైక్రోసాఫ్ట్
  • పండ‌గ బ‌హుమ‌తిగా `రూ` చాట్‌బోట్
దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా స్కైప్ లైట్ వెర్ష‌న్‌లో గ్రూప్ వీడియో కాలింగ్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల స్కైప్ లైట్ వినియోగ‌దారులు గ్రూప్ వీడియో లేదా ఆడియో కాల్ చేసుకునే స‌దుపాయం క‌లగ‌నుంది. దీంతో పాటు పండగ బహుమతిగా `రూ` అనే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్‌ ఫీచ‌ర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

దీని సాయంతో దీపావ‌ళి గ్రీటింగ్ కార్డుల‌ను కూడా స్నేహితుల‌కు పంపుకోవ‌చ్చు. అలా పంపుకోవ‌డానికి కొత్త దీపావ‌ళి స్పెష‌ల్ గ్రీటింగ్ కార్డులు, మెసేజ్‌లు స్కైప్‌లో ఉన్నాయి. గూగుల్ వారి ఆలో, డుయో, ఫేస్‌బుక్ వారి మెసెంజ‌ర్‌, వాట్సాప్‌ల‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ `స్కైప్ లైట్` యాప్‌ను మార్కెట్లోకి తీసుకువ‌చ్చింది. దీని ద్వారా త‌క్కువ బ్యాండ్‌విడ్తుల్లో ఆడియో, వీడియో కాల్స్‌, మెసేజ్‌లు చేసుకునే స‌దుపాయం క‌ల్పించింది. ఈ యాప్ గుజ‌రాతీ, బెంగాలీ, హిందీ, మ‌రాఠి, తెలుగు, త‌మిళం, ఉర్దూ భాష‌ల‌ను స‌పోర్ట్ చేస్తుంది.
skype lite
group calling feature
microsoft
diwali
whatsapp
messenger
duo

More Telugu News